పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..
Thursday, June 10, 2010
Wednesday, June 9, 2010
కర్షక జీవి
ఆశే తన ఊపిరిగా
పంచభూతములు ఎదురు నిలిచినా
బ్రతుకే చితికినా, దేశానికి వెన్నెముకగా
అధిక వడ్డీ నడ్డి విరువగా
గాలిలో ఉసురు నిలిపి
గంజి నీళ్ళకు మొహం వాచి
మెతుకు గింజలు చేతికందక
తరుముకొచ్చే మృత్యుదేవతను లెక్కచేయక
జనావళి క్షుద్భాదను తీర్చే..
ఓ.. అన్నదాతా..! నీ త్యాగనిరతికి ఇవే నా జోహార్లు..!!

Friday, May 21, 2010
తెలుగు వెబ్సైట్ల.. కోతి కొమ్మచ్చి
ఏంటోనండి ఈ మధ్య మైండు పూర్తిగా బ్లాక్ అయిపొయింది. సృజనాత్మకంగా ఏదైనా చేద్దామని అనుకున్నా ఆలోచనలే తట్టటం లేదు. హడావుడిగా మొదలు పెట్టిన "పదములు కావలెను"కు ప్రజల తిరస్కారం ఎదురైంది.. సరే పోనిలే..
నిజం చెప్పాలంటే నాకు తీరుబడే ఉండటం లేదంటే నమ్మండి.. సరే ఎలాగూ ఆఫీసు లో పనిలేదు కదా అని కొంచెం పదనిసలుని కదుపుదామని ..ఇలా వచ్చానన్నమాట ..
రాజకీయాల మీద రాద్దామంటే మనసుపోవట్లేదు
పోనీ సినిమాల గురించి? అబ్బే.. ఏమి లాభం లేదు..
పోనీ లోకజ్ఞానం గురించి?.. (అదేంటో మనకస్సలు తెలీదు)..
సరే లెండి.. ఇంతకీ చెప్పాలనుకున్న విషయమేమిటంటే
మొన్న GreatAndhra.com లో మహేష్ బాబు మీద ఒక గాస్సిప్ వ్రాసాడు. అదేమిటంటే మహేష్ బాబు గత రెండున్నర సంవత్సరాల నుంచి త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా ఇంకా లేటయ్యేలాగుందని, దాన్ని మొదలు పెట్టిన దగ్గర్నుంచి ప్రొడ్యూసర్ నుంచి హీరోయిన్ దాక అందరూ మారిపోతున్నారని, దర్శకుడు త్రివిక్రమ్ కు డైరెక్షన్ మీద పూర్తిగా శ్రద్ధ తగ్గిపోయిందని, రచయితగానే అతను ఆస్వాదిస్తున్నాడని అందువల్ల మహేష్ సినిమా నుంచి తప్పుకోబోతున్నాడని. డైరెక్షన్ను ఇంకొకరికి అప్పచెప్పి కేవలం సూచనలు సలహాలకి మాత్రమే పరిమిత మౌతాడని సదరు వెబ్సైటు ఉవాచ.
దీనికి మహేష్ బాబు స్పందిస్తూ "ఈ చెత్త ని నమ్మకండి.. త్రివిక్రమ్ కి ఫోన్ చేసి విషయం చెప్పి నవ్వుకుంటాం.. " అని తన twitter లో వ్రాసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన పోటి వెబ్సైటు అయిన Gulte.com అనే మరో వెబ్సైటు "మహేష్ బాబు greatAndhra.com ని చెత్త అన్నాడహో.." అని ప్రచారం మొదలు పెట్టింది.
అయితే కధ అక్కడితో ఆగలేదు..
తర్వాత రోజు GreatAndhra.com వారు ఏమి చెయ్యాలో తెలియక మహేష్ తన twitter లో వ్రాసుక్కున్న వ్యాఖ్యల పై రంధ్రాన్వేషణ మొదలుపెట్టి మరొక ఆర్టికల్ పబ్లిష్ చేసారు.. స్టార్ నటుడైన మహేష్ బాబు అర్థం పర్థం లేని విషయాలని twitter లో వ్రాస్తున్నాడని అభిమానులనుంచి వీరికి ఇ-మెయిల్స్ వస్తున్నాయని రుజువులు చూపే ప్రయత్నం చేసారు, ఇలాగే చేస్తే మహేష్ బాబు స్టార్ డం పోతుందని కూడా భయపెట్టడానికి కృషి చేసారు.
అయితే, SMS పరిభాషలో స్పెల్లింగులు, గ్రామర్లు ఎవరూ పట్టించుకోరని Twitter వంటి వెబ్సైటులు చిన్న చిన్న త్వరిత సందేశాలను పొందు పరుచుకోవాడనికి ఉపయోగిస్తారని సదరు వెబ్సైటు వారికి తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది.
పత్రిక విలువలు పడిపోతున్నాయి, మీడియా దిగజారుతోంది అని ప్రతిసారి మొత్తుకొనే ఈ వెబ్ సైట్లు ఈ రకమైన గురివింద గింజ చందాన ప్రవర్తించకుండా ఉంటే బావుంటుంది
ఇక Gulte.com విషయానికి వస్తే, ఇదొక "కాపి పిల్లి". పక్క వెబ్సైటు వాడు ఎ న్యూస్ పెడితే ఈ వెబ్సైటు ఆ న్యూస్ ను కాపీకొట్టేస్తుంది . ఒక్కొక్క సారి వ్రాసే మేటర్ కు జత చేసిన వీడియో క్లిప్పింగ్ కు సంబంధమే ఉండదు.

Sunday, January 31, 2010
పదనిసలు "పదములు కావలెను"కు కరువైన స్పందన..
పదనిసలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన "పదములు కావలెను" పోటికి టపాకారుల స్పందన కరువైంది. దీనితో పోటి యాజమాన్యం గడువును మరొక 15 రోజులు పొడిగించటానికి నిర్ణయించింది. అంతే కాక షరతులకు వెసులుబాటు కల్పించింది. ఇకపైనుంచి పదములతో పాటు వాక్యములు కూడా పంపవచ్చును.
ఉదా: "కోస్తా.. నాలుక కోస్తా"
పై డైలాగ్ పూర్వాపరాలు నేను మనవి చేసుకోవక్కర్లేదనుకుంటున్నాను. ఈ పోటీ పూర్వాపరాలు ఇక్కడ..
మీ స్పందన ఆశిస్తూ..

Sunday, January 17, 2010
మీకు గుండె దిటవుంటేనే ఈ టపా చూడండి..
మనిషి మెదడుకుండే ఊహా శక్తి అమోఘం.. లేనిది ఉన్నట్లు,ఉన్నది లేనట్లు చూపించి మనను ఒక్కొక్కసారి మోసం చేస్తుంది కూడా..ఒక్కొక్క చిత్రాన్ని చూస్తే ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది.. కొన్ని హాయిని కలిగిస్తే కొన్ని భయాన్ని, కొన్ని బాధ అనుభవింప చేస్తాయి. ఇదంతా మన మెదడు అనవసరంగా ఊహించుకోవడం వల్ల కూడా కావచ్చు..!! ఈ క్రింది చిత్రం ఆ తరహాకి చెందినదే.. ఈ చిత్రం చూడడం వల్ల మనసులో కలిగే బాధవంటి తెలియని భావనకు నన్ను బాధ్యుణ్ణి చేయవద్దని మనవి..
ఈ చిత్రం చూసిన తర్వాత మీకు కలిగిన అనుభవాన్ని వివరిస్తే సైకాలజి పరిశోధన విభాగం వారికి పనికొస్తుంది..
Friday, January 15, 2010
"పదములు" కావలెను..
చదువరులు మరియు తోటి టపాకారులుకు,
ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.ఈ మధ్య కాలంలో "పదనిసలు"కు పదములు దొరకక "టపా"యిత్వము మిక్కిలి భారముగా మారినది.. హత విధీ..!
ఇందు మూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియచేసుకోవడమేమనగా..దయచేసి పదో పరకో పదములు దానం చేయ వలసిందిగా కోరుతున్నాము.
అయితే మీ పద దానములు స్వీకరింపబడాలంటే మీరు పంపే పదాలకు ఈ క్రింది షరతులు వర్తించాలి .. ఇక ఎంపిక విధానములో రెండు అంకములు ఉంటాయి. ప్రతి అంకములోను రెండు విభాగాములుంటాయి.
మొదటి అంకం - స్వీకరణ, సమర్పణ
స్వీకరణ విభాగంలో:
కర్తలు:
స్వీకరించు వారు : పదనిసలు
దాతలు : నెటిజనులు, టపాకారులు, చదువరులు
పదముల స్వీకరణకు గడువు నిర్ణయింపబడుతుంది. ఆ నిర్ణీత గడువులోగా మీ మీ పదాలను సమర్పించ వలసిందిగా పదనిసలు మనవి. దాతలు పదములు దానం చేసే ముందుగా క్రింది షరతులను ఒకసారి చదవ వలసిందిగా నా మనవి. నిర్ణీత గడువు లోగా అందని పదములు నిర్ద్వందంగా తిరస్కరించబడతాయి.
సమర్పణ విభాగంలో:
కర్తలు:
స్వీకరించు వారు : పదనిసలు
ఒకసారి సమర్పించిన పదములను వ్యక్తిగత విన్నపం ద్వారా తొలగించుకోవచ్చును. కానీ, సరిదిద్దుకొనుటకు వీలుకాదు. ఒకే పదము ఇద్దరిచేత దానం చేయబడ్డప్పుడు ఎవరు ముందుగా మాకు అందచేసారో వారికే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గడువు : 2 దినములు (తారీఖులు త్వరలో తెలియచేస్తాము).
రెండవ అంకం: వర్గీకరణ, బిరుదు ప్రధానం
వర్గీకరణ విభాగంలో:
కర్తలు:
స్వీకరించు వారు : నెటిజనులు, టపాకారులు, చదువరులు
పదముల వర్గీకరణ క్రింది అంశాలపైన ఆధారపడి జరుగుతుంది.
1. ధన భావన (Positive word)
2. ఋణ భావన (Negative word)
౩. తటస్థ భావన (Neutral word)
వర్గీకరించిన పదాలను మరల మీ ముందుకు తీసుకొచ్చి "అభిప్రాయ సేకరణ" జరుపుతాము. ఏ పదానికి చదువరులు, టపాకారులు ఎక్కువగా ఓటు వేస్తారో.. ఆ సదరు పద దాతకు.. పదనిసలు తరుఫు నుంచి "పదనిసలు ఉత్తమ పద దాత" బిరుదు ఇవ్వబడుతుంది.
షరతులు:
1. తెలుగు పదములు మాత్రమే అయ్యిఉండాలి. కనీసము ఒక్క శాతము తెలుగును ప్రతిబింబించినా స్వీకరణకు అర్హమైనవిగా పరిగణింపబడతాయి.
2. ఈ పదాలు "రాజకీయ నాయకులు లేదా నటీ నటులు" ఏదో ఒక సందర్భంలో వాడి ఉండాలి. (ప్రాచుర్యం పొందిన పదాలకు ప్రాముఖ్యత..).
౩. ఇది సరదాకి చేసే ప్రయత్నమే కానీ ఎవరినీ కించపరచడానికో లేక ఏదో నిరూపించటానికో కాదు.
4. షరతులను అకారణంగా మార్చటానికి గాని, తొలగించటానికి గాని, లేక జతచేయటానికి కానీ "పదనిసలు"కు పూర్తి హక్కులు ఉన్నాయి.
5. పదములను అకారణంగా తిరస్కరించుటకు లేదా తొలగించుటకు "పదనిసలు"కు సర్వ హక్కులు కలవు.
6. పదనిసలు న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం.
7. ప్రాంత, భాష, కుల,మత, వయోలింగ మరియు వర్ణనలకు అతీతంగా పదముల ఎంపిక జరుగును.
సలహాలు,సూచనలకు స్వాగతం. అంతిమ నిర్ణయం మాత్రం పదనిసలుదే.
ఉత్సాహం ఉన్నవారు.. పదాలను క్రింది "వ్యాఖ్యలు" రూపంలో దానం చేయగలరు. పదదానములకు ఆఖరు తేది: 31 జనవరి 2010 (అమెరికా సమయం ఆఖరు నిముషం వరకు

Tuesday, December 22, 2009
రాజగోపాల్ ను ఎందుకు ప్రశ్నించకూడదు?
ముందుగా ఆనందిని గారి టపా ఆనందిని: నేను నా దీక్ష
చదివి .. నా టపా చదవవలసిందిగా సందర్శకులకు మనవి
ఆనందిని గారికి,
మీ టపాకి అభినందనలు.
"కెసిఆర్ నిజాయితీతో దీక్షను కొనసాగించారు." ఇది మీకే చిరాగ్గాలేదు చెప్పడానికి?
"విజయవాడలో ఒక్క మనిషి కూడా ఆయన్ను నిలదీసే సాహసం చేయలేదు.. ఆ దము్మలు లేవు ఎవరికీ.. లగడపాటి చర్యను విద్యార్థులైనా గట్టిగా ప్రశ్నించిన పాపాన పోలేదు.. ప్రజల్లోంచి.. తెలుగుతల్లి గర్భసంచిలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమ స్ఫూర్తికి ఇంతకంటే తార్కాణం ఏముంది?"
మీరు విజయవాడ అని కొత్తగా సంబోధిస్తున్నారేమిటి? యావత్ ఆంధ్రప్రదేశ్ అనాలి. ఇక ప్రశ్నించడం విషయానికొస్తే, ఎందుకు ప్రశ్నించాలి? తెలంగాణా నాయకులు చెప్పినట్టుగా 2000 మంది గూండాలని విజయవాడ నుంచి వెనుకేసుకు రాలేదనా? లేక కెసిఆర్ లేదా హరీష్ రావు పురిగొల్పినట్లుగా జనాలని ఆత్మహత్యలకు ప్రేరేపించలేదనా? లేక మా దీక్షభంగం చేస్తే ఆత్మహత్యా దాడులకు పాల్పడటం లాంటి statements ఇవ్వలేదనా? లేక తలకాయలకు వెల కట్టలేదనా? లేక సమైక్యతను కోరుకుంటున్నందుకా? లేకా దీక్షాభంగం జరిగినా, జరగనట్టుగా supplements మీద ఆధారపడుతూ, కేంద్రం "ప్రక్రియ మొదలు పెడతాం" అనగానే ఒక్క ఉదుటున మంచం నుంచి దిగి దీక్ష విరమిస్తున్నానంటు, తెలంగాణా వచ్చేసిందంటూ తప్పుడు వాగ్దానాలు చేయలేదనా?
"..ప్రెస్‌క్లబ్‌కు వచ్చి తన చర్యలను సమర్థించుకోవటానికి నానా నానా తంటాలు పడి మరీ ఇబ్బంది పడి..జవాబులు చెప్పీ చెప్పక.. గాంధీనీ, ఫ్లూయిడ్‌సనీ, ప్రాచీన ఆధునిక దీక్షలనీ ప్రస్తావిస్తూ పాపం లగడపాటి విలేఖరుల సమావేశాన్ని ముగించారు.."
మరొక్క సారి మీరు తెలంగాణావాదులా, సమైక్యంధ్రా వాదులా అన్నది మరచి రాజగోపాల్ ఇంటర్వ్యూ చూడవలసినదిగా మనవి.
"ఆయన కుటుంబ సభ్యులే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేసి మరీ నిమ్‌సకు తరలించేలా చూసుకున్నారు.."
దీనికి సమాధానం నేను చెప్పక్కర్లేదనుకుంటాను.. మీరే చెప్పారు...

Subscribe to:
Posts (Atom)