పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Thursday, September 20, 2007

ఓ చిలకా..!

ఓ చిలకా..!


కూర్చోకు నాకెందుకులే అని ఓ మూలక

చెబుతాను విను ఎటూ మెదలక


నా జీవితంలో ఒక చిన్న మెలిక

నా కనులలో ఒక నిప్పు కణిక


రామా! కాదా ఆ సేతు నీ మాలిక

పోదా ఆ "నాస్తిక"నిథి ఏదో ఒక రోజు కూలక

వాలదా వాస్తవగని భారతావని లోగిట

లేడా మన మారుతి చేయగ సేతు సంద్రమ్మును పీలిక

ఇదే సమయము సీతమ్మ అగుటకు కాళిక


అసలేమిటో ఆరాముడికే ఎరుక

నాకు వచ్చింది మాత్రం కళ్ళకలక


ఇయ్యవే బాసట నా మాటకు ఓ చిలకా!!

Monday, September 17, 2007

ముంచు నా కొడుకుని....

4 చీమలు ఒక చెరువులో స్నానం చేస్తున్నాయి. ఒక ఏనుగు వచ్చి హఠాత్తుగా ఆ చెరువులొ దూకింది.

ఆ దెబ్బకి మూడు చీమలు ఎగిరి వచ్చి ఒడ్డు మీద పడ్డాయి. ఒక చీమ మత్రం ఎగిరి ఏనుగు తలమీద

పడింది. అప్పుడు గట్టు మీద మూడు చీమలు ఇల అంటున్నాయి నాల్గవ చీమతో


"ముంచు నా కొడుకుని.. వాడికి మనమంటే ఎంటో తెలియలి".

Thursday, September 13, 2007

"వాచి"పోయినది..


వెర్రి వెంగళప్ప వాచి పోగొట్టుకున్నాడు. మొత్తం అన్ని చోట్లా వెతికాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది.

చివరకి ఒక ప్రకటన పేపెర్లొ ఈ విధంగా ఇచ్చాడు.

వాచిపోయినది

గుర్తులు:

1. వాచి లో 3 ముళ్లు ఉంటాయి.

2. పోయినప్పుడు వాచీ చిన్న ముల్లు మూడు దగ్గరా, పెద్దముల్లు ఒకటి దగ్గర ఉన్నాయి.

3. మూడో ముల్లు పుర చేతి వైపుకి తిరుగుతోంది.

Monday, September 10, 2007

ఘోరం..! నిర్లక్ష్యం..! అవినీతి..!
నేను రోజుకు రెండుసార్లయినా పంజాగుట్ట దారిలో ప్రయణం చేస్తాను. అలాంటి నాకు నిన్నటి వరకు తెలియదు నేను ప్రయణం చెస్తున్న దారి అంత ప్రమాదకరం అని. Fly over కూలిన విషయం తెలియగానే నేను ఏదోల ఫీలయ్యాను. ప్రజల ప్రాణాలతో ఆడుకొంటున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?

Tuesday, September 4, 2007

తొలి పలుకు..

నమస్కారం,
ముందుగా నా తరుఫు నుంచి మీ అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..