పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Thursday, April 9, 2009

మళ్ళీ సాలిగూడులోకి..

అవునండి.. మళ్ళీ సాలిగూడులోకి వచ్చి పడ్డానండి. ఎన్నాళ్ళయ్యింది ఈ సాలిగూడులో కబుర్లు చెప్పి. ఏంటి ఈ సాలిగూడు సొల్లు ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి "web" దీన్నే కొంచెం మన తెలుగులో సోగ్గా సాలిగూడు అన్నానన్నమాట. ఇక పొతే.., ఎవరు? అని అడగకండి. పోయిన సంవత్సరం "నాదొక కల" అని టైటిల్ పెట్టి కొంచెం కధ చెప్పి వదిలేసాలెండి. దానిని ఏ ముహూర్తం లో మొదలుపెట్టానో కాని ఆ కధ నాకొక కలగా మిగిలిపోయింది. దానిని పూరించటానికి నాకు కొంచెం సమయమివ్వమని కోరుతూ అసలు విషయానికి వస్తాను.
అమెరికా వారి పుణ్యమా అని మన జీవితాలు నాలుగు లే-ఆఫ్ లు ఆరు జీతాల కోతలు కింద తయారయ్యిందని ఇప్పుడు నేను కొత్తగా మనవి చేసుకోనక్కర్లేదనుకుంటున్నాను. ఒకానొక దశలో నాకు ఏమి చెయ్యాలో తోచక ఈ ప్రపంచం లో ఎక్కడైనా మంచి జరుగుతోందా అని ఆలోచించటం మొదలు పెట్టా. ఏమిటీ, నవ్వుతున్నారా? అవున్లెండి కంప్యూటర్లు వచ్చాక జనాలెక్కడ ఆలోచిస్తున్నార్లెండి! నేను మాత్రం తక్కువ తిన్నానా? నేను గూగుల్ చేశా.. నా పిచ్చి కాకపొతే ఎవరికైనా మంచి జరిగితే అది సాలిగూడు లో ఎందుకు దొరుకుతుంది?? అదే చెడు జరగితే మాత్రం నిమిషాలలో ప్రపంచమంతా పాకిపోతుంది. కొందరికి చెడ్డ వార్తలంటే ప్రాణం. ఎంత దూరమైన మోసేస్తారు. అదే ఒకరికి మంచి జరిగిందటే మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడ్చి దుఖంతో పాటు ఆ విషయాన్నీ మింగేస్తారు.

అన్నీ సవ్యంగా ఉంటే జీవితం లో ఆనందమేముంటుంది చెప్పండి. బోర్ కొట్టదూ? అందుకే కష్టం వచ్చినప్పుడు కుంగిపోక, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోక సహనంతో రెండిటిని ఓకే విధంగా తీసుకోగలిగితే అసలు సిసలు జీవితానందం పొందవచ్చని అనుభవ పూర్వకముగా మనవి చేసుకుంటున్నాను.

అసలు విషయం మర్చిపోయా మీరు కూడా గూగుల్ ప్రయత్నించండి ఈ ప్రపంచంలో ఎక్కడైనా మంచి జరుగుతోందేమో తెలుసుకోండి.. Believe me,you will definitely feel good.. పరభాష ఉపయోగించినందుకు క్షమించండి..

మళ్లీ కలుద్దాం..