పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Tuesday, December 22, 2009

రాజగోపాల్ ను ఎందుకు ప్రశ్నించకూడదు?

ముందుగా ఆనందిని గారి టపా ఆనందిని: నేను నా దీక్ష

చదివి .. నా టపా చదవవలసిందిగా సందర్శకులకు మనవి

ఆనందిని గారికి,
మీ టపాకి అభినందనలు.
"కెసిఆర్‌ నిజాయితీతో దీక్షను కొనసాగించారు." ఇది మీకే చిరాగ్గాలేదు చెప్పడానికి?

"విజయవాడలో ఒక్క మనిషి కూడా ఆయన్ను నిలదీసే సాహసం చేయలేదు.. ఆ దము్మలు లేవు ఎవరికీ.. లగడపాటి చర్యను విద్యార్థులైనా గట్టిగా ప్రశ్నించిన పాపాన పోలేదు.. ప్రజల్లోంచి.. తెలుగుతల్లి గర్భసంచిలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమ స్ఫూర్తికి ఇంతకంటే తార్కాణం ఏముంది?"

మీరు విజయవాడ అని కొత్తగా సంబోధిస్తున్నారేమిటి? యావత్ ఆంధ్రప్రదేశ్ అనాలి. ఇక ప్రశ్నించడం విషయానికొస్తే, ఎందుకు ప్రశ్నించాలి? తెలంగాణా నాయకులు చెప్పినట్టుగా 2000 మంది గూండాలని విజయవాడ నుంచి వెనుకేసుకు రాలేదనా? లేక కెసిఆర్ లేదా హరీష్ రావు పురిగొల్పినట్లుగా జనాలని ఆత్మహత్యలకు ప్రేరేపించలేదనా? లేక మా దీక్షభంగం చేస్తే ఆత్మహత్యా దాడులకు పాల్పడటం లాంటి statements ఇవ్వలేదనా? లేక తలకాయలకు వెల కట్టలేదనా? లేక సమైక్యతను కోరుకుంటున్నందుకా? లేకా దీక్షాభంగం జరిగినా, జరగనట్టుగా supplements మీద ఆధారపడుతూ, కేంద్రం "ప్రక్రియ మొదలు పెడతాం" అనగానే ఒక్క ఉదుటున మంచం నుంచి దిగి దీక్ష విరమిస్తున్నానంటు, తెలంగాణా వచ్చేసిందంటూ తప్పుడు వాగ్దానాలు చేయలేదనా?

"..ప్రెస్‌క్లబ్‌కు వచ్చి తన చర్యలను సమర్థించుకోవటానికి నానా నానా తంటాలు పడి మరీ ఇబ్బంది పడి..జవాబులు చెప్పీ చెప్పక.. గాంధీనీ, ఫ్లూయిడ్‌‌సనీ, ప్రాచీన ఆధునిక దీక్షలనీ ప్రస్తావిస్తూ పాపం లగడపాటి విలేఖరుల సమావేశాన్ని ముగించారు.."
మరొక్క సారి మీరు తెలంగాణావాదులా, సమైక్యంధ్రా వాదులా అన్నది మరచి రాజగోపాల్ ఇంటర్వ్యూ చూడవలసినదిగా మనవి.

"ఆయన కుటుంబ సభ్యులే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేసి మరీ నిమ్‌‌సకు తరలించేలా చూసుకున్నారు.."
దీనికి సమాధానం నేను చెప్పక్కర్లేదనుకుంటాను.. మీరే చెప్పారు...

Monday, December 14, 2009

Saturday, December 5, 2009

మేలుకొలుపు..

కె.సి.ఆర్.కు "బూతుల ధీర" బిరుదు ప్రదానం

      మీ హాస్య చతురతకు నా అభినందనలు.ముందుగా నేను తెలుగువానిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. మనం భావ వ్యక్తీకరణకు భాషను వాడతాం. భాషను మరొక అర్థం లో వాక్కు అని కూడా అంటారు. వాక్కుకు అధిపతి లేదా స్వరూపం సరస్వతి. తల్లికి సరస్వతికి మనం సమ గౌరవం, సమానార్ధం ఇస్తాం కాబట్టి "తెలుగు తల్లి" అన్నారు. ఇక తెలంగాణా తల్లి ఎలా వచ్చిందో నేను వివరించక్కర్లేదు అనుకుంటున్నాను. తెలంగాణా అని గిరి గీసుకున్న మాత్రమున సామాన్య మానవుడి కష్టాలు తీరిపోతాయంటే..అంతకంటే కావలిసిందేముంది. మన రాజకీయ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలంగాణా ప్రాంత నాయకుడు కావచ్చు లేదా ఆంధ్రా ప్రాంత నాయకుడు కావచ్చు లేదా మరొక నాయకుడు కావచ్చు. ఈ స్వతంత్ర భారత దేశంలో ఎవరి అభిప్రాయం వారు నిస్సందేహంగా వెలిబుచ్చవచ్చు. ఒకరు మేము తెలంగాణాకి వ్యతిరకం అన్నంత మాత్రమున లేదా మేము తెలంగాణాకి సానుకూలం అన్నంత మాత్రమున వారి మీద కక్ష కట్టటడం లేదా దాడి చేయడం ఖండించదగినది. ఎవరి అభిప్రాయాలూ వారివి.. కాదా? ఈ రోజున వరద తాకిడి వల్ల ఛిద్రమయిన బ్రతుకులని ఎవరయినా పట్టించుకుంటున్నారా? వరద వచ్చిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల విరాళాలు, విదేశాల నుంచి విరాళాల నిమిత్తం వచ్చిన డబ్బు ప్రజలనుంచి వసూలు చేసిన చందాలను వారికి సక్రమంగా అందాయా లేదా అని ఎవరికయినా సందేహం వచ్చిందా? కష్ట జీవులకు కావలిసింది.. నమ్మకం.. ఈ రోజు కాకపోయినా రేపు మన జీవనం మెరుగవుతుంది అన్న విశ్వాసం. అటువంటి నమ్మకం ఈ నాయకులలో ఒక్కరైన నాకు కలిగించారని అనుకోను. ఈరోజు మా ఇంటి అద్దె 6౦౦౦/-. రేపు తెలంగాణా వచ్చినా రాకున్నా నేను ప్రతినెలా చెల్లిన్చవలిసిందే. నేను తెలంగాణా వాడినైన మాత్రాన మా ఇంటి యజమాని(అతనూ తెలంగాణా వాడేలెండి) ఊరికినే ఇల్లు ఇవ్వడు కదా..! ఈరోజు పప్పు ధర ఒక కే.జి. 80/- (తక్కువలో తక్కువ). కోడి గుడ్డు రూ. ౩.50 /- ఎవరికి పట్టింది? మనం మనుషులమని మరచి చాలా రోజులయింది. నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి చాలా రోజులయింది. మరొక విషయం, "గాలి"వాటమేమయింది? తెలంగాణా అంశంతో కొట్టుకుపోయిందా? బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత, మనము సాధించిన విజయాలు వాటి నాణ్యతలను రంగాల వారిగా పరిశీలిస్తే మనం గర్వంగా చెప్పుకోదగ్గవి ఎన్ని? స్వదేశంలో మనమే ఇలా ప్రాంతాల వారిగా, కుల, మత ప్రాతిపదికగా, భాషా ప్రాతిపదికగా కొట్టుకుంటున్నప్పుడు, ఆస్ట్రేలియా లేదా విదేశాలలో భారతీయుల పైన దాడులు జరిగినప్పుడు ఖండించడంలో ఎంతవరకు అర్థం ఉందో నాకర్థం కాదు. మధ్య ఐరోపాలో 7 దేశాలు ఒకే నదీ జలాలను ఎటువంటి సమస్యా లేకుండా వాడుకుంటున్నాయి.  ఇక మన విషయం ప్రస్తావిన్చక్కర్లేదనుకుంటా.
        పూర్వపు తరం ఉద్యమ నాయకులకు, ఈ తరం ఉద్యమ నాయకుల స్పష్టమైన బేధం ఉంది..! లేదంటారా? మన నాయ"కుల"కు కావలిసింది వారి యొక్క రాజకీయ భవిష్యత్తు. ప్రజల కష్టనష్టాలు కాదు. ఎవరి ప్రాంతం మీద వారికి, ఎవరి భాష మీద వారికి అభిమనముండవచ్చు. కాని ఎదుట వ్యక్తిని సహించలేనంత దురభిమానముకూడదు. సమస్యల పరిష్కారము కోసం ప్రయత్నించవచ్చు. కానీ క్రొత్త సమస్యను కొనితెచ్చుకోవటం అవివేకమౌతుంది. ఒక బస్సు తగలపెడితే 5 -7 గురు నిరుద్యోగులవుతారు. వారు తెలంగాణా వారు కావచ్చు లేదా ఆంధ్ర ప్రాంతం వారు కావచ్చు లేదా మరే ప్రాంతం వారైనా కావచ్చు. ఈ రోజు ఆందోళనల్లో పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరిది? నష్ట పరిహారం చెల్లిస్తే సరిపోయినట్టేనా?
           జీవితపు నాణ్యత గురించి నాయకులను ప్రశ్నించండి. వేరొక రాష్ట్రం గురించి పోరాడమంటున్నారు సరే.. మరి వారి దగ్గర సరయిన ప్రణాళిక ఉందా? ఏదయినా సమస్యకు పరిష్కారం చూపించేటప్పుడు ఈ మౌలికమయిన అంశాలకు పరిష్కారాన్ని కూడా వివరిస్తే మాలాంటి అజ్ఞానులకు అర్థం అవుతుంది.  మా బ్రతుకుకు, మా బిడ్డల భవిష్యత్తుకు వారి దగ్గర సమాధానం ఉందా? లేక తెలంగాణా అని పేరు మార్చుకుని మురిసిపోవడమేనా?