పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Sunday, January 31, 2010

పదనిసలు "పదములు కావలెను"కు కరువైన స్పందన..

పదనిసలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన "పదములు కావలెను" పోటికి టపాకారుల స్పందన కరువైంది. దీనితో పోటి యాజమాన్యం గడువును మరొక 15 రోజులు పొడిగించటానికి నిర్ణయించింది. అంతే కాక షరతులకు వెసులుబాటు కల్పించింది. ఇకపైనుంచి పదములతో పాటు వాక్యములు కూడా పంపవచ్చును.


ఉదా: "కోస్తా.. నాలుక కోస్తా"

పై డైలాగ్ పూర్వాపరాలు నేను మనవి చేసుకోవక్కర్లేదనుకుంటున్నాను. ఈ పోటీ పూర్వాపరాలు ఇక్కడ..

మీ స్పందన ఆశిస్తూ..

Sunday, January 17, 2010

మీకు గుండె దిటవుంటేనే ఈ టపా చూడండి..

         మనిషి మెదడుకుండే ఊహా శక్తి  అమోఘం.. లేనిది ఉన్నట్లు,ఉన్నది లేనట్లు చూపించి మనను ఒక్కొక్కసారి మోసం చేస్తుంది కూడా..ఒక్కొక్క చిత్రాన్ని చూస్తే ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది..  కొన్ని హాయిని కలిగిస్తే కొన్ని భయాన్ని, కొన్ని బాధ అనుభవింప చేస్తాయి. ఇదంతా మన మెదడు అనవసరంగా ఊహించుకోవడం వల్ల కూడా కావచ్చు..!! ఈ క్రింది చిత్రం ఆ తరహాకి చెందినదే.. ఈ చిత్రం చూడడం వల్ల మనసులో కలిగే బాధవంటి తెలియని భావనకు నన్ను బాధ్యుణ్ణి  చేయవద్దని మనవి..
      
ఈ చిత్రం చూసిన తర్వాత మీకు కలిగిన అనుభవాన్ని వివరిస్తే సైకాలజి పరిశోధన విభాగం వారికి పనికొస్తుంది..     

Friday, January 15, 2010

"పదములు" కావలెను..

చదువరులు మరియు తోటి టపాకారులుకు,

ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.ఈ మధ్య కాలంలో "పదనిసలు"కు పదములు దొరకక "టపా"యిత్వము మిక్కిలి భారముగా మారినది.. హత విధీ..!

ఇందు మూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియచేసుకోవడమేమనగా..దయచేసి పదో పరకో పదములు దానం చేయ వలసిందిగా కోరుతున్నాము.

అయితే మీ పద దానములు స్వీకరింపబడాలంటే మీరు పంపే పదాలకు ఈ క్రింది షరతులు వర్తించాలి .. ఇక ఎంపిక విధానములో రెండు అంకములు ఉంటాయి. ప్రతి అంకములోను రెండు విభాగాములుంటాయి.

మొదటి అంకం - స్వీకరణ, సమర్పణ
స్వీకరణ విభాగంలో:
కర్తలు:
స్వీకరించు వారు : పదనిసలు
దాతలు : నెటిజనులు, టపాకారులు, చదువరులు
పదముల స్వీకరణకు గడువు నిర్ణయింపబడుతుంది. ఆ నిర్ణీత గడువులోగా మీ మీ పదాలను సమర్పించ వలసిందిగా పదనిసలు మనవి. దాతలు పదములు దానం చేసే ముందుగా క్రింది షరతులను ఒకసారి చదవ వలసిందిగా నా మనవి. నిర్ణీత గడువు లోగా అందని పదములు నిర్ద్వందంగా తిరస్కరించబడతాయి.

సమర్పణ విభాగంలో:
కర్తలు:
స్వీకరించు వారు : పదనిసలు
ఒకసారి సమర్పించిన పదములను వ్యక్తిగత విన్నపం ద్వారా తొలగించుకోవచ్చును. కానీ, సరిదిద్దుకొనుటకు వీలుకాదు. ఒకే పదము ఇద్దరిచేత దానం చేయబడ్డప్పుడు ఎవరు ముందుగా మాకు అందచేసారో వారికే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గడువు : 2 దినములు (తారీఖులు త్వరలో తెలియచేస్తాము).

రెండవ అంకం: వర్గీకరణ, బిరుదు ప్రధానం
వర్గీకరణ విభాగంలో:
కర్తలు:
స్వీకరించు వారు : నెటిజనులు, టపాకారులు, చదువరులు
పదముల వర్గీకరణ క్రింది అంశాలపైన ఆధారపడి జరుగుతుంది.
1. ధన భావన (Positive word)
2. ఋణ భావన (Negative word)
౩. తటస్థ భావన (Neutral word)

వర్గీకరించిన పదాలను మరల మీ ముందుకు తీసుకొచ్చి "అభిప్రాయ సేకరణ" జరుపుతాము. ఏ పదానికి చదువరులు, టపాకారులు ఎక్కువగా ఓటు వేస్తారో.. ఆ సదరు పద దాతకు.. పదనిసలు తరుఫు నుంచి "పదనిసలు ఉత్తమ పద దాత" బిరుదు ఇవ్వబడుతుంది.

షరతులు:
1. తెలుగు పదములు మాత్రమే అయ్యిఉండాలి. కనీసము ఒక్క శాతము తెలుగును ప్రతిబింబించినా స్వీకరణకు అర్హమైనవిగా పరిగణింపబడతాయి.
2. ఈ పదాలు "రాజకీయ నాయకులు లేదా నటీ నటులు" ఏదో ఒక సందర్భంలో వాడి ఉండాలి. (ప్రాచుర్యం పొందిన పదాలకు ప్రాముఖ్యత..).
౩. ఇది సరదాకి చేసే ప్రయత్నమే కానీ ఎవరినీ కించపరచడానికో లేక ఏదో నిరూపించటానికో కాదు.
4. షరతులను అకారణంగా మార్చటానికి గాని, తొలగించటానికి గాని, లేక జతచేయటానికి కానీ "పదనిసలు"కు పూర్తి హక్కులు ఉన్నాయి.
5. పదములను అకారణంగా తిరస్కరించుటకు లేదా తొలగించుటకు "పదనిసలు"కు సర్వ హక్కులు కలవు.
6. పదనిసలు న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం.
7. ప్రాంత, భాష, కుల,మత, వయోలింగ మరియు వర్ణనలకు అతీతంగా పదముల ఎంపిక జరుగును.


సలహాలు,సూచనలకు స్వాగతం. అంతిమ నిర్ణయం మాత్రం పదనిసలుదే.

ఉత్సాహం ఉన్నవారు.. పదాలను క్రింది "వ్యాఖ్యలు" రూపంలో దానం చేయగలరు. పదదానములకు ఆఖరు తేది: 31 జనవరి 2010 (అమెరికా సమయం ఆఖరు నిముషం వరకు