పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Monday, October 25, 2010

సోనియా.. ఇక ఉద్ధరించింది చాలు..!

సోనియా ఏఐసిసి అధ్యక్షురాలు.. ప్రపంచంలోనే ప్రభావమంతమైన మహిళ. పివి నరసింహారావు తర్వాత అయోమయంలో ఉన్న కాంగ్రెస్ పార్టి తిరిగి అధికారం లోకి రావటానికి ఏకైక కారణం.. సోనియా.

ప్రధాని పదవిని తృణప్రాయంగా తిరస్కరించి రాజకీయ చతురత ద్వారా ఎందరో మన్నలను అందుకున్నఆమె, క్రమంగా దేశ ప్రజల విశ్వాసాన్ని    కోల్పోతున్నట్టే కనిపిస్తోంది. ఒక్కొక్క రాష్ట్రం కాంగ్రెస్ గుప్పిట్లోంచి జారుతున్నాయి. పెరిగిన అక్రమాలు, లంచగొండితనం ప్రజలను ప్రత్యామ్నాయం వైపు మళ్ళేలా చేస్తున్నాయి. కామన్ వెల్త్ గేమ్స్ అక్రమాలు ప్రపంచం ముందు మన దేశాన్ని తలదించు కొనేలా చేశాయి. ఈ పాపానికి కాంగ్రెస్ తప్పక మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. లంచగొండులకు మన దేశం లో కఠిన శిక్షలు పడిన దాఖలాలు తక్కువ.
 
కొడుకును భావి ప్రధానిగా చేయాలనే దుగ్ధతో సోనియా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా కాంగ్రెస్ కు బుద్ధి వచ్చేలా చేస్తాయని భావిస్తున్నాను. మన రాష్ట్ర విషయానికొస్తే, విభజన నిర్ణయం అటుంచి, మరొక సారి కాంగ్రెస్ కు సామాన్యుడు ఎవడూ ఓటు వేసే సాహసం చేయడు. మొత్తం రాష్ట్ర పరిస్థితిని కంపు కంపు చేయుటలో తనవంతు పాత్ర పోషించింది.
రోశయ్యకు అసలు బుద్ధి ఉందా? అమ్మగారిని సంతృప్తి పరచటానికి తెలుగు లలితా కళాతోరణానికి రాజీవ్ పేరు తగిలిస్తాడా? కావాలంటే తన పేరు రోసోనియ్యా అనో, రాజీవయ్య అనో మార్చుకోవలిసింది. అసలు రాజీవ్ మన రాష్ట్రానికి ఏం చేసాడు? ఢిల్లీ వీధుల్లో మన తెలుగు జాతి అభిమానం ఇలా తాకట్టు పెడుతున్న ఈ నాయకులను ఏమి చెయ్యాలి? సొంత లాభాల కోసం హై కమాండ్ భజన చేసే వాళ్ళని ఎవడో చెప్పినట్టుగా పంచె లూడగొట్టాలి..!