పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Sunday, January 17, 2010

మీకు గుండె దిటవుంటేనే ఈ టపా చూడండి..

         మనిషి మెదడుకుండే ఊహా శక్తి  అమోఘం.. లేనిది ఉన్నట్లు,ఉన్నది లేనట్లు చూపించి మనను ఒక్కొక్కసారి మోసం చేస్తుంది కూడా..ఒక్కొక్క చిత్రాన్ని చూస్తే ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది..  కొన్ని హాయిని కలిగిస్తే కొన్ని భయాన్ని, కొన్ని బాధ అనుభవింప చేస్తాయి. ఇదంతా మన మెదడు అనవసరంగా ఊహించుకోవడం వల్ల కూడా కావచ్చు..!! ఈ క్రింది చిత్రం ఆ తరహాకి చెందినదే.. ఈ చిత్రం చూడడం వల్ల మనసులో కలిగే బాధవంటి తెలియని భావనకు నన్ను బాధ్యుణ్ణి  చేయవద్దని మనవి..
      
ఈ చిత్రం చూసిన తర్వాత మీకు కలిగిన అనుభవాన్ని వివరిస్తే సైకాలజి పరిశోధన విభాగం వారికి పనికొస్తుంది..     

2 comments:

  1. హ హ. ఈ పిక్ చూస్తే నాకు ఒక సందర్భం గుర్తుకువచ్చింది. కొన్నేళ్ళ క్రిందట ఆఫీసులో స్టాప్లర్ పనిచేయకపోతే మా టర్కిష్ కోలీగ్ ని చూడమని అడిగాను. ఎందుకు పనిచేయడం లేదా అని తన చూపుడు వేలు మధ్యలో పెట్టి కొట్టాడు. చక్కగా పని చేసిందప్పుడు!!

    ReplyDelete
  2. హ్హ హ్హ. ఎక్కడి దాకానో ఎందుకు. ఓ సారి ఏదో ఆలోచిస్తూ ఆఫీస్ లో నా చూపుడు వేలు మీద నేనే స్టేపిల్ చేసుకున్నా. దేవుడు కళ్ళెదురుగా కనపడాలంటే, తపస్సుల కన్నా ఇవ్వే షార్ట్ కట్స్ అని అర్ధమయింది అప్పుడు.

    ReplyDelete

మీ వ్యాఖ్యలకు ముందుగానే కృతఙ్ఞతలు.