పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Sunday, September 23, 2018

కాల చక్రం



కాలచక్రం పరాశక్తి ఆధీనంలో నడుస్తుంది. ఇప్పటివరకు ఎంతోమంది శివులు ఎంతోమంది విష్ణువులు ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు. ఇప్పుడు నడుస్తుంది 51వ వాడు.


  1. కృత/సత్య యుగం (17,28,000 మానవ సంవత్సరాలు )
  2. త్రేతాయుగం (12,96,000 మానవ సంవత్సరాలు )
  3. ద్వాపరయుగం (8,64,000 మానవ సంవత్సరాలు )
  4. కలియుగం (4,32,000 మానవ సంవత్సరాలు)

4 యుగాలకు 1 మహాయుగం 

71 మహాయుగాలకు 1 మన్వంతరం 

ప్రతిమన్వంతరం తర్వాత 1 సంధికాలం వస్తుంది (17,28,000 సంవత్సరాలు)

14 మన్వంతరాలకు ఒక సృష్టి 1 కల్పం 14 మంది  మనువులు. 


1000 మహా యుగాలకు బ్రహ్మకు పగలు. (1 కల్పం )

2000 యుగాలకు బ్రహ్మకు ఒక దినం. (2 కల్పములు)

ప్రస్తుత మనం 7వ  మన్వంతరములో ఇప్పటివరకు 27 మహాయుగాలు గడిచాయి. 

1 కల్పానికి 14 మన్వంతరాలు 14 సంధి కాలాలు ఉంటాయి
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరాలు. 

ఇప్పుడు కలియుగం , వైవస్వత మనువులో శ్వేతవరాహ యుగంలో  ఉన్నాం

జులియన్ క్యాలెండర్ ప్రకారం 17 ఫిబ్రవరి /18 ఫిబ్రవరి 3102 BCE న 28వ కలియుగం మొదలైంది. ఇంకా కలియుగం ముగియటానికి 4,26,880 సంవత్సరాలు  ఉన్నాయి


Thursday, September 20, 2018

సృష్టి

సృష్టి  ఆవిర్భావము


  1. పరాపరము దీనియందు శివం పుట్టింది 
  2. శివం నుండి శక్తి పుట్టింది 
  3. శక్తి నుండి నాదం పుట్టింది 
  4. నాదం నుండి బిందువు 
  5. బిందువు నుండి సదాశివం 
  6. సదాశివం నుండి మహేశ్వరం 
  7. మహేశ్వరం నుండి ఈశ్వరం 
  8. ఈశ్వరం నుండి రుద్రుడు 
  9. రుద్రుడు నుండి విష్ణువు 
  10. విష్ణువు నుండి బ్రహ్మ 
  11. బ్రహ్మ నుండి ఆత్మ 
  12. ఆత్మ నుండి దహరాకాశం 
  13. దహరాకాశం నుండి వాయువు 
  14. వాయువు నుండి అగ్ని 
  15. అగ్ని నుండి జలం 
  16. జలం నుండి పృథ్వి
  17. పృథ్వి యందు ఓషధులు 
  18. ఓషధులు యందు అన్నం
  19. అన్నం వల్ల జీవం మనగలుగుతుంది 

Monday, November 1, 2010

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..!

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..!

Monday, October 25, 2010

సోనియా.. ఇక ఉద్ధరించింది చాలు..!

సోనియా ఏఐసిసి అధ్యక్షురాలు.. ప్రపంచంలోనే ప్రభావమంతమైన మహిళ. పివి నరసింహారావు తర్వాత అయోమయంలో ఉన్న కాంగ్రెస్ పార్టి తిరిగి అధికారం లోకి రావటానికి ఏకైక కారణం.. సోనియా.

ప్రధాని పదవిని తృణప్రాయంగా తిరస్కరించి రాజకీయ చతురత ద్వారా ఎందరో మన్నలను అందుకున్నఆమె, క్రమంగా దేశ ప్రజల విశ్వాసాన్ని    కోల్పోతున్నట్టే కనిపిస్తోంది. ఒక్కొక్క రాష్ట్రం కాంగ్రెస్ గుప్పిట్లోంచి జారుతున్నాయి. పెరిగిన అక్రమాలు, లంచగొండితనం ప్రజలను ప్రత్యామ్నాయం వైపు మళ్ళేలా చేస్తున్నాయి. కామన్ వెల్త్ గేమ్స్ అక్రమాలు ప్రపంచం ముందు మన దేశాన్ని తలదించు కొనేలా చేశాయి. ఈ పాపానికి కాంగ్రెస్ తప్పక మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. లంచగొండులకు మన దేశం లో కఠిన శిక్షలు పడిన దాఖలాలు తక్కువ.
 
కొడుకును భావి ప్రధానిగా చేయాలనే దుగ్ధతో సోనియా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా కాంగ్రెస్ కు బుద్ధి వచ్చేలా చేస్తాయని భావిస్తున్నాను. మన రాష్ట్ర విషయానికొస్తే, విభజన నిర్ణయం అటుంచి, మరొక సారి కాంగ్రెస్ కు సామాన్యుడు ఎవడూ ఓటు వేసే సాహసం చేయడు. మొత్తం రాష్ట్ర పరిస్థితిని కంపు కంపు చేయుటలో తనవంతు పాత్ర పోషించింది.
రోశయ్యకు అసలు బుద్ధి ఉందా? అమ్మగారిని సంతృప్తి పరచటానికి తెలుగు లలితా కళాతోరణానికి రాజీవ్ పేరు తగిలిస్తాడా? కావాలంటే తన పేరు రోసోనియ్యా అనో, రాజీవయ్య అనో మార్చుకోవలిసింది. అసలు రాజీవ్ మన రాష్ట్రానికి ఏం చేసాడు? ఢిల్లీ వీధుల్లో మన తెలుగు జాతి అభిమానం ఇలా తాకట్టు పెడుతున్న ఈ నాయకులను ఏమి చెయ్యాలి? సొంత లాభాల కోసం హై కమాండ్ భజన చేసే వాళ్ళని ఎవడో చెప్పినట్టుగా పంచె లూడగొట్టాలి..!

Thursday, June 10, 2010

పసిడి పుష్పం..

సరదాగా నా సెల్ ఫోన్ తో తీసిన చిత్రం. నాకు ఎంతగానో నచ్చిన చిత్రం..మీ కోసం..

Wednesday, June 9, 2010

కర్షక జీవి

ఆశే తన ఊపిరిగా
పంచభూతములు ఎదురు నిలిచినా
బ్రతుకే చితికినా, దేశానికి వెన్నెముకగా
అధిక వడ్డీ నడ్డి విరువగా
గాలిలో ఉసురు నిలిపి
గంజి నీళ్ళకు మొహం వాచి
మెతుకు గింజలు చేతికందక
తరుముకొచ్చే మృత్యుదేవతను లెక్కచేయక
జనావళి క్షుద్భాదను తీర్చే..

ఓ.. అన్నదాతా..! నీ త్యాగనిరతికి ఇవే నా జోహార్లు..!!

Friday, May 21, 2010

తెలుగు వెబ్సైట్ల.. కోతి కొమ్మచ్చి

ఏంటోనండి ఈ మధ్య మైండు పూర్తిగా బ్లాక్ అయిపొయింది. సృజనాత్మకంగా ఏదైనా చేద్దామని అనుకున్నా ఆలోచనలే తట్టటం లేదు. హడావుడిగా మొదలు పెట్టిన "పదములు కావలెను"కు ప్రజల తిరస్కారం ఎదురైంది.. సరే పోనిలే..
నిజం చెప్పాలంటే నాకు తీరుబడే ఉండటం లేదంటే నమ్మండి.. సరే ఎలాగూ ఆఫీసు లో పనిలేదు కదా అని కొంచెం పదనిసలుని కదుపుదామని ..ఇలా వచ్చానన్నమాట ..

రాజకీయాల మీద రాద్దామంటే మనసుపోవట్లేదు
పోనీ సినిమాల గురించి? అబ్బే.. ఏమి లాభం లేదు..
పోనీ లోకజ్ఞానం గురించి?.. (అదేంటో మనకస్సలు తెలీదు)..

సరే లెండి.. ఇంతకీ చెప్పాలనుకున్న విషయమేమిటంటే

మొన్న GreatAndhra.com లో మహేష్ బాబు మీద ఒక గాస్సిప్ వ్రాసాడు. అదేమిటంటే మహేష్ బాబు గత రెండున్నర సంవత్సరాల నుంచి త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా ఇంకా లేటయ్యేలాగుందని, దాన్ని మొదలు పెట్టిన దగ్గర్నుంచి ప్రొడ్యూసర్ నుంచి హీరోయిన్ దాక అందరూ మారిపోతున్నారని, దర్శకుడు త్రివిక్రమ్ కు డైరెక్షన్ మీద పూర్తిగా శ్రద్ధ తగ్గిపోయిందని, రచయితగానే అతను ఆస్వాదిస్తున్నాడని అందువల్ల మహేష్ సినిమా నుంచి తప్పుకోబోతున్నాడని. డైరెక్షన్ను ఇంకొకరికి అప్పచెప్పి కేవలం సూచనలు సలహాలకి మాత్రమే పరిమిత మౌతాడని సదరు వెబ్సైటు ఉవాచ.


దీనికి మహేష్ బాబు స్పందిస్తూ "ఈ చెత్త ని నమ్మకండి.. త్రివిక్రమ్ కి ఫోన్ చేసి విషయం చెప్పి నవ్వుకుంటాం.. " అని తన twitter లో వ్రాసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన పోటి వెబ్సైటు అయిన Gulte.com అనే మరో వెబ్సైటు "మహేష్ బాబు greatAndhra.com ని చెత్త అన్నాడహో.." అని ప్రచారం మొదలు పెట్టింది.
అయితే కధ అక్కడితో ఆగలేదు..

తర్వాత రోజు GreatAndhra.com వారు ఏమి చెయ్యాలో తెలియక మహేష్ తన twitter లో వ్రాసుక్కున్న వ్యాఖ్యల పై రంధ్రాన్వేషణ మొదలుపెట్టి మరొక ఆర్టికల్ పబ్లిష్ చేసారు.. స్టార్ నటుడైన మహేష్ బాబు అర్థం పర్థం లేని విషయాలని twitter లో వ్రాస్తున్నాడని అభిమానులనుంచి వీరికి ఇ-మెయిల్స్ వస్తున్నాయని రుజువులు చూపే ప్రయత్నం చేసారు, ఇలాగే చేస్తే మహేష్ బాబు స్టార్ డం పోతుందని కూడా భయపెట్టడానికి కృషి చేసారు.

అయితే, SMS పరిభాషలో స్పెల్లింగులు, గ్రామర్లు ఎవరూ పట్టించుకోరని Twitter వంటి వెబ్సైటులు చిన్న చిన్న త్వరిత సందేశాలను పొందు పరుచుకోవాడనికి ఉపయోగిస్తారని సదరు వెబ్సైటు వారికి తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది.

పత్రిక విలువలు పడిపోతున్నాయి, మీడియా దిగజారుతోంది అని ప్రతిసారి మొత్తుకొనే ఈ వెబ్ సైట్లు ఈ రకమైన గురివింద గింజ చందాన ప్రవర్తించకుండా ఉంటే బావుంటుంది

ఇక Gulte.com విషయానికి వస్తే, ఇదొక "కాపి పిల్లి". పక్క వెబ్సైటు వాడు ఎ న్యూస్ పెడితే ఈ వెబ్సైటు ఆ న్యూస్ ను కాపీకొట్టేస్తుంది  . ఒక్కొక్క సారి వ్రాసే మేటర్ కు జత చేసిన వీడియో క్లిప్పింగ్ కు సంబంధమే ఉండదు.