పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Wednesday, June 18, 2008

జన జాగృతి

జన జాగృత నవ భారత మహోదయం
ఈకనులతోనే కాంచుదాం
ఈ జీవితమున సాధించుదాం.. జన జాగృత

ప్రాంత భాష కులమతాల కలకలతో
పలురీతుల బలహీనతలావరించే
అందరామొకటిగా నిలిచి తరతమ బేధాలు మరచి
జాతిని సేవించుదాం.. మన భారతినే పూజించుదాం.. జన జాగృత

కంటి నలుసు కాలి ముల్లు కలిగించే బాధలను
గుండె రగుల మెదడు పగుల ఇడుములు తొలగించుదాం
అహరహమూ శ్రమియించి జగతిన శిరమెత్తి నిలిచి
జాతిని సేవించుదాం.. మన భారతినే పూజించుదాం జన జాగృత


చిన్నప్పుడెప్పుడో మా మాష్టారు నేర్పిన పాట ఇది. నాకు కొంతే గుర్తుంది,మిగిలింది ఎవరికైనా తెలిస్తే పూరించరూ...???

Wednesday, April 2, 2008

నాదొక కల..


సమయం సరిగ్గా రాత్రి 10.30. మన భాగ్యనగరం మెల్లిగా నిద్రలొకి జరుతున్నవేళ. ట్రాఫిక్ కూడ నెమ్మదిగా సర్దుమణుగుతోంది.నేను మాములుగానే ఆఫీస్ నుంచి బైక్ మీద బయలుదేరా. అది పౌర్ణమి రాత్రి అయినా ఆకాశం అంతామబ్బుగా ఉండడం తో వీధి దీపాలు లేని చోట్ల మాత్రం కొంచెం చీకటిగ ఉంది.నా రూము శంకరమఠం దగ్గర. మా ఆఫీస్ అమీర్‌పేట లో ఉండడంతో నేను నెక్లెస్ రోడ్ మీదుగ ఎక్కువగా వెళ్లేవాడిని. ఆ రోజు కూడా మామూలుగానే ఆఫీస్‌లొ నా పనులన్నీ అయిపోయాక యధావిధిగా బయలుదేరాను. చల్లగా గాలి వీస్తొంది. రోడ్డు ఖాళి గా ఉండడంతొ సహజం గానే అంతవరకు నాలో దాక్కుని ఉన్న ఆపరిచితుడు ఒక్కసారిగా బయటకు వచ్చాడు.నా బండి స్పీడో మీటర్ 90టచ్ అవటం మొదలుపెట్టింది.వాతవరణం కూడ నాకు అనుకూలించినట్లుగా చల్లటి గాలి మొహనికి తగులుతుంటే అప్పటివరకు ఉన్న పని అలసట పోయి నేను ఏదో లొకంలొ విహరిస్తున్నట్టుగా అనిపించింది. అంతా సరిగానే ఉంటే ఇంకేంటి? అక్కడే చిన్న మెలిక (అదేనండి బాబూ "ట్విస్ట్"). సరిగ్గా నెక్లెస్ రోడ్ మధ్యలోకి రాగానే ఏదో చిన్న శబ్దం..ఆ తర్వత అది పెద్దదవుతూ నా కలల్ని, ఉత్సాహాన్ని దిగ్భ్రమలలోయలోకి తోసేస్తూ నా ఆనందన్ని స్పీడోమీటర్ లో చూపిస్తూ బండి స్లో అవ్వడం మొదలైంది. నేను ఏక్సిలరేటర్ రైస్ చెయ్యడం, నా బండి అంతకన్నా ఎక్కువగా శబ్దం చేస్తు స్లో అవడం. అప్పుడప్పుడు నేను చెప్పే సోది విని మా ప్రోజెక్ట్ మేనేజర్ అయినా తలూపుతాడేమొ గాని.. ఆరోజు నా బండికేమయ్యిందో గాని నేను దాని గాలి(అదేనండి ప్రాణం) తీసినా నా మాట వినేటట్టు కనిపించలేదు. చివరకు మా ఇద్దరికి జరిగిన పోరాటంలో దానిదే పై టైరు అయ్యింది. అది మాత్రం ఏదో గొప్ప పానిపట్టు యుద్ధంలో విజయం సాధించిన దానిలాగ నెక్లెస్ రోడ్ మధ్యలో స్టాండ్ వేయించుకుని కూర్చుంది. అప్పుడు చూడాలి నా ఫేస్ .. మాడిపోయిన మసాల దోసైనా బాగుంటుందేమో..! దూరంగా ఉన్న బుద్ధుడికి కూడ నన్ను ఆ పొజిషన్లో చూస్తే నవ్వాలనిపించిందేమొ అటు తిరిగి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. ఏమైందో ప్రోబ్లం చూద్దమని మా అశ్వరాజాన్ని పక్కకి నడిపించి స్టాండ్ వేద్దామనుకునేలోగానే.. ఎవరో పక్కన వచ్చి నిలబడ్డట్టయ్యింది. ఎవరా అని తల పైకెత్తి చూస్తినా ఒక్క నిమిషం నన్ను నేనే మర్చిపోయా. ఎదురుగా ఒక అమ్మాయి. అలాంటి ఇలాంటి అమ్మాయి కాదండి బాబూ. మేని ఛయ, పొడవుకు పొడవు, సున్నితమైన పాదాలు.. ఇంకా ఇవన్ని వర్ణించడం నా వల్ల కాదు కానీ సింపుల్‌గా రెండే రెండు మాటల్లో చెప్పాలంటే అప్సరస అంటారే అచ్చం అలాగుంది.

క్షమించండి నాకు ఆఫీసుకు వెళ్ళే సమయం దగ్గర పడుతోంది..మిగతాది తర్వాత చెప్పుకుందామే?

Monday, March 31, 2008

పెట్టమ్మా పరుగు..

పరుగే పెట్టు.. పరుగే పెట్టు..
అలసట అన్నది లేనే లేదు
నిరంతరంగా పరుగే పెట్టు
ప్రపంచ మన్నది చిన్నదిర
అందులో నువ్వు గెలిచేటట్టు ..

పరుగే పెట్టు.. పరుగే పెట్టు
రాజు లేదు.. పేద లేదు..
కాదు విజయం ఒకరికి సొత్తు
కష్టం నష్టం ఏదైనా గెలిచే వరకు పోరాడు
నీతి, నియమం నీవైతే ప్రపంచానికే ఎదురేగు ..


పరుగే పెట్టు.. పరుగే పెట్టు..
అలసట అన్నది లేనే లేదు
నిరంతరంగా పరుగే పెట్టు
ప్రపంచ మన్నది చిన్నదిర
అందులో నువ్వు గెలిచేటట్టు
పరుగే పెట్టు.. పరుగే పెట్టు..