నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు , రేపటి కంటే ఎల్లుండి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలనే తపనే నన్ను అనుక్షణం ముందుకు నడిపిస్తుంది. ఓటమి గెలుపులలో ఓటమి నాకిష్టం. ఎందుకంటే ఓడితే గెలుపు విలువ తెలుస్తుంది, నేటి ఓటమే రేపటి గెలుపుకు నాంది అని భావన. ఎలాగైనా బ్రతకచ్చు కన్నా ఇలాగే బ్రతకాలని కోరుకొనే వాడిని. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి దేనినైన ఎదిరించి నిలబడగలిగే మనస్తత్వం. డబ్బు, కీర్తి కన్నాఎదుటివాడికి ఏవిధంగా ఉపయోగపడ్డామనేది ముఖ్యం. తప్పు ఎవరు చేసినా, ఏ రూపంలో ఉన్నా తప్పు తప్పే నని నమ్మినవాడిని.
సోదరుడు, మిత్రుడు సాయికిరణ్ గారికి, ముందుగా మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. మీరు పంపిన లంకె బాగుంది. అందుకని వేరొక టపా లో దాన్నిజతచేస్తున్నాను. మీరు అన్నట్టుగా గద్దర్ పాటలు నేను విన్నాను. అంతే కాకుండా అందెశ్రీ గారు వ్రాసిన చాలా పాటలు నేను విన్నాను. తెలుగు భాష అయినంత వరకు ఏ టపాకైనా సరే పదనిసలు లో స్థానం ఉంటుంది. వేరే భాషలకు వేరే ప్రస్థానాలు ఉన్నాయనుకోండి. మీరు ఈ రాజకీయ నాయకుల మాయాజాలంలో పడిపోయినట్టున్నారు. మేలుకోండి. అసలు సమస్య ఏమిటంటే, ఒకరు రెచ్చగొట్టగానే రెచ్చిపోయి ఆత్మహత్యలూ, హర్తాళ్లు, బందులు చేయడానికి ప్రజలకి పనేమీ లేదా? అసలు ప్రజలకి ఇటువంటి వాటి గురించి ఆలోచించే తీరికే లేదు. ఇదిగో ఇలా మీకు, నాకు, మనలాంటి వాళ్లకు తప్ప. ఇప్పటివరకు ఇంత గొడవలలోనూ ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తాం అని తెలంగాణా నాయకులూ అనలేదూ, ఇటు మిగతా ప్రాంతాల నాయకులూ అనలేదు. మధ్యలో బలయింది మాత్రం సామాన్య మానవులు. ఇలా చెప్పుకు పొతే.. ఎన్నో.. నిజాయితీ, నిబద్ధత గురించి మాట్లాడే అర్హత ఇప్పటి తరం నాయకులకు లేనే లేదు. పొట్ట చేత పట్టుకుని పనికెళ్ళే వాళ్లకు ఈ బంద్ ల వల్ల పోయ్యిలోంచి పిల్లిని కదపనవసరం లేని పరిస్థితి. ఇంకా ఏముంది, ఇదింకా మొదలు మాత్రమే. ఇంకా రసవత్తర సన్నివేశాల కోసం వేచి చూడండి.. మన భారత దేశంలో ప్రజలతో ఆడుకోవడానికి ప్రాంతం, భాష, కులం, మతం ఇలా చాలా ఆటలున్నాయి ఈ రాజకీయనాయకులకు.
మీ సౌలభ్యం కోసం జయ తెలంగాణా లంకెను పొందుపరుస్తున్నాను.
సోదరుడు, మిత్రుడు సాయికిరణ్ గారికి,
ReplyDeleteముందుగా మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. మీరు పంపిన లంకె బాగుంది. అందుకని వేరొక టపా లో దాన్నిజతచేస్తున్నాను. మీరు అన్నట్టుగా గద్దర్ పాటలు నేను విన్నాను. అంతే కాకుండా అందెశ్రీ గారు వ్రాసిన చాలా పాటలు నేను విన్నాను. తెలుగు భాష అయినంత వరకు ఏ టపాకైనా సరే పదనిసలు లో స్థానం ఉంటుంది. వేరే భాషలకు వేరే ప్రస్థానాలు ఉన్నాయనుకోండి. మీరు ఈ రాజకీయ నాయకుల మాయాజాలంలో పడిపోయినట్టున్నారు. మేలుకోండి. అసలు సమస్య ఏమిటంటే, ఒకరు రెచ్చగొట్టగానే రెచ్చిపోయి ఆత్మహత్యలూ, హర్తాళ్లు, బందులు చేయడానికి ప్రజలకి పనేమీ లేదా? అసలు ప్రజలకి ఇటువంటి వాటి గురించి ఆలోచించే తీరికే లేదు. ఇదిగో ఇలా మీకు, నాకు, మనలాంటి వాళ్లకు తప్ప. ఇప్పటివరకు ఇంత గొడవలలోనూ ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తాం అని తెలంగాణా నాయకులూ అనలేదూ, ఇటు మిగతా ప్రాంతాల నాయకులూ అనలేదు.
మధ్యలో బలయింది మాత్రం సామాన్య మానవులు. ఇలా చెప్పుకు పొతే.. ఎన్నో.. నిజాయితీ, నిబద్ధత గురించి మాట్లాడే అర్హత ఇప్పటి తరం నాయకులకు లేనే లేదు. పొట్ట చేత పట్టుకుని పనికెళ్ళే వాళ్లకు ఈ బంద్ ల వల్ల పోయ్యిలోంచి పిల్లిని కదపనవసరం లేని పరిస్థితి. ఇంకా ఏముంది, ఇదింకా మొదలు మాత్రమే. ఇంకా రసవత్తర సన్నివేశాల కోసం వేచి చూడండి.. మన భారత దేశంలో ప్రజలతో ఆడుకోవడానికి ప్రాంతం, భాష, కులం, మతం ఇలా చాలా ఆటలున్నాయి ఈ రాజకీయనాయకులకు.
మీ సౌలభ్యం కోసం జయ తెలంగాణా లంకెను పొందుపరుస్తున్నాను.